సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంచలన రీతిలో భారత ప్రభుత్వం 2016లో రద్దు చేసిన రూ.1000 నోట్లు తిరిగి చలామణిలోకి వస్తున్నాయి. జనవరి 1 నుంచి ఈ నోట్లు తిరిగి మార్కెట్‌లోకి రానున్నాయి. ఇదే సమయంలో రూ.2000నోట్లను ప్రభుత్వం తిరిగి వెనకకు తీసుకుంటుంది’ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోలు వైరల్ అయ్యి ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి, అఈ నేపథ్యంలో అసలు ఈ వార్తలో నిజానిజాలు ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపట్ల కేంద్ర ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. వీడియోలోని సందేశం పూర్తిగా అవాస్తమని తేల్చి చెప్పింది. పూర్తిగా తప్పుడు సమాచారం ఉన్న ఆ వీడియోను ఎవరూ కూడా ఇతరలకు షేర్ చేయవద్దని కోరింది. రూ.1000 నోట్లను తిరిగి చలామణీలోకి తెచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని.. అదేవిధంగా రూ.2000 నోట్లను వెనక్కి తీసుకోవడం లేదని అపోహలు వద్దని ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *