సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నియంతృత్వ పెత్తందారీ విధానాలపై కార్మికుల పోరాటం తో సాధించిన విజయాలకు ప్రతీక గా… నేడు, సోమవారం భీమవరం లో వాడవాడలా.. ప్రపంచ వ్యాప్తంగా మే డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మే డే స్ఫూర్తి తో భీమవరం లో మోనోఫలి కేబుల్ టివి వ్యవస్థపై విజయ కేతనం ఎగురవేసిన సిగ్మా కేబుల్ టివి ప్రస్థానం గుర్తుకు తెచ్చుకోవాలి. 1992 లో ఒక చిన్న కేబుల్ టివి నెట్ వర్క్ గా భీమవరంలోని ఇండియన్ బ్యాంకు రోడ్డు పరిధిలో ఒక మధ్య తరగతి నివాసం నుండి కేవలం నెలవారీ 50 రుసుముతో ప్రారంభించబడిన సిగ్మా కేబుల్ టివి ప్రసారాలలో అపట్లో ఎన్నో సాంకేతిక విజయాలు సాధించింది. తన న్యూస్ ఛానెల్స్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసింది. అంతేకాదు 1994 సంవత్సరం లో పట్టణంలో తొలిసారి శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలు, అంత్యాక్షరి ప్రసారాలు, ఎన్నికల కౌంటింగ్ హాలు విశేషాలు శరవేగంగా అందించింది. అయితే పట్టణంలో మోనోపలీ కేబుల్ వ్యవస్థ బలంగా పెరిగి నెలవారీ 150 రుసుములు వసూళ్లు చెయ్యాలన్న ధోరణలు నేపథ్యంలో .. దేశంలో ఎక్కడ లేని విధంగా సిగ్మా కేబుల్ టివి 2002 మే డే రోజు నుండి పూర్తీ స్వతంత్రగా 3 లోకల్ ఛానెల్స్ తో పాటు 30 ఛానెల్స్ 30 రూపాయలకే అందించి ఎంత నష్టపోయిన సరే.. సామాన్య కుటుంబాలకు అండగా నిలచింది. తరువాత స్వల్ప ధరలకే 45 ఛానెల్స్ అందించింది. ఇదొక సుదీర్ఘ పోరాటం .. మహాభారతం అంత చరిత్ర.. అయితే కట్టే.. కొట్టే.. తెచ్చే ..తరహాలో చెబితే .. సిగ్మా కేబుల్ టివి ఉనికి లేకుండా చెయ్యాలని ఎన్నో తరహా దాడులు, ఒత్తిడులు జరిగాయి. ప్రజలకు వినోదాన్ని అందించే పే ఛానెల్స్ ప్రసారాలు నిలచిపోయాయి. డబ్బు కడతాము అన్న.. పే ఛానెల్స్ ఇచ్చేవారు లేరు. ఈ టివి , మాటివి , జీ తెలుగు వంటి ఛానెల్స్ తిరిగి సాధించడం కోసం ఢిల్లీ లోని ట్రాయ్ కోర్టులో పలుమారులు సిగ్మా కేబుల్ టివి చేసిన పోరాటాలు ఆ కేసులు అంత ఇంతా కాదు.. అయితే పే ఛానెల్స్ ప్రసారాలలో అంతిమ విజయం సిగ్మా కేబుల్ సాధించింది. కొందరు స్వార్ధపరులు కేబుల్ వైర్లు కత్తిరించడం, ప్రసారాలు ఆపడం ఎన్నో అవరోధాలు, కష్టాలు నష్టాలు తట్టుకోవలసి వచ్చింది. అయితే పట్టణంలో 75 శాతం కుటుంబాలు ఉండే వన్ టౌన్ 3 టౌన్ ప్రాంతాలలో సిగ్మా కేబుల్ కనెక్షన్ లేనివారికి వారికీ కూడా కేబుల్ టివి ప్రసారాలు కేవలం 100 రూపాయలు లోపు మాత్రమే వసూళ్లు చేసుకొనే పరిస్థితి. అంత పోటీగా ..ఇదే పరిస్థితి 15 ఏళ్ళు పాటు కొనసాగింది. అంటే ఒక లెక్కలో కోట్ల రూపాయల ప్రజా ధనం ఆదా అయ్యింది. ఆఖరికి ప్రధాని మోడీ మోనో పాలి కేబుల్ వ్యవస్థకు వ్యతిరేకంగా కేబుల్ టివి డిజిటలైజేషన్ చెయ్యడంతో 2017 జనవరి నెల నుండి ప్రతి కేబుల్ టీవీ వినియోగదారుడు 2000 రూపాయలు పైగా ఖరీదయిన సెట్ అఫ్ బాక్స్ వాడి ఛానెల్స్ బట్టి డబ్బు చెల్లించాలని ఆదేశాలు అమలు కావడంతో సిగ్మా కేబుల్ టివి అనివార్య పరిస్థితులలో 24 ఏళ్ళ తన ప్రస్థానానికి ముగింపు పలికింది. అయితే భీమవరంలో 30 రూపాయలు కేబుల్ టివిగా అపట్లో రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంత ఇంతకాదు. ఎన్నో ప్రాంతాలలో కొత్త కేబుల్ టివి నెట్ వర్క్స్ ఆగమనానికి ప్రేరణగా నిలచింది. ఈ రోజు చిన్నారులు ఎంతో ఇష్టంగా చూసే డిస్నీ , నిక్ , మూవీస్ నౌ , నియో స్పోర్ట్స్ వంటి ఎన్నో కొత్త పే ఛానెల్స్ ను భీమవరంలో తొలిసారి ప్రారంభించిన ఘనత కూడా సిగ్మా కేబుల్ టివి దే ..ఒక స్వచ్చంద సంస్థ తరహాలో ప్రజల కోసం పోరాడిన సిగ్మా కేబుల్ టివి కి మే డే చరిత్రలో ఒక పేజీ ఉంటుంది.. ఈ సందర్భంగా సిగ్మా కేబుల్ టివి మడమ త్రిప్పని పోరాటానికి సహకరించిన అప్పటి స్టాప్ కు శ్రేయోభిలాషుల లందరికి ‘మే డే’ లాల్ సలాం.. మీ .. సిగ్మా ప్రసాద్ కాలమ్స్, www. sigmatelugu.in
