సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పునః ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సభ్యత్వ నమోదులో భాగంగా పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రూ.100 కట్టి సీఎం చేతుల మీదుగా మెుదటి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సందర్భముగా చంద్రబాబు మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయి నుండి పార్టీని బలోపేతం చెయ్యాలని క్యాడర్ కు పిలుపు నిచ్చారు. ‘‘నేను 1995 సీఎంనే కానీ 2014 సీఎంను కాదు. ఈసారి ఖచ్చితంగా రాజకీయ పరిపాలనే చేస్తా. విశ్వాసనీయతను నిలబెట్టుకుంటూ రాజకీయ ముసుగులో తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదు జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ రూ.10లక్షల కోట్లకు పైగా అప్పు భారం మోస్తున్నామనే విషయం గ్రహించాలి. మనం ఓ విషవలయంలో ఉన్నామని గుర్తించాలి, మనకూటమి ప్రభుత్వా పాలనకు ప్రజలలో చెడ్డ పేరు తేవడానికి వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. వాటిని త్రిప్పి కొట్టాలి. ఇప్పటికే చాలా వ్యవస్థలను గాడిలో పెట్టాం. మొన్నటి ఎన్నికల్లో రాక్షసుడితో యుద్ధం చేశానని అనాలో, మరేం అనాలో తెలియట్లేదు.నష్టపోయిన కార్యకర్తలను ఆదుకొంటాను. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా టీడీపీ వారిపై పెట్టిన తప్పుడు కేసులకు చట్ట పద్ధతిలోనే పరిష్కారం చూపిస్తా…రాష్ట్రంలో ఎక్కడ ఇసుక దందా జరుగుతున్నా తిరుగుబాటు చేయండి. నేను అండగా ఉంటా అన్నారు.
