సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం జగనన్న విద్య దీవెన’ బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం జగన్ తన మాటలలో తన ప్రక్కనే నిలబడిన స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వ్యక్తితం గురించి మాట్లాడుతూ.. ఒక సినిమా ఆయన.. దత్తపుత్రుడు గతంలో భీమవరంలో పోటీ చేస్తే మీ ప్రజలు ఆయనను ఓడించారు. ఆయన ఓడిపోయాక మరల తన నివాసం ఉన్న ప్రక్క రాష్ట్రం వెళ్లిపోయారు. ఆయనను ఓడించింది మీ గ్రంధి శ్రీనివాస్ .. ఈయన ఇక్కడ రియల్ లైఫ్ హీరో.. ఎదో దత్తపుత్రుడుని ఓడించాడని కాదు.. ఒకసారి నా దగ్గరకు వచ్చి మీరు ‘నాకు మంత్రి పదవి ఇవ్వకపోయిన పర్వాలేదు.. మా భీమవరం పట్టణాన్ని జిల్లా కేంద్రం చెయ్యండి చాలు’.. అన్నారు. అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రియల్ లైఫ్ హీరో కాక మరేమిటి? అందుకే మరోసారి ఆ సినిమా హీరో ఇక్కడ నుండి పోటీ చెయ్యడానికి సిద్ధం అవుతున్నట్లు ఉన్నారు. మన వైసీపీ తరపున ఇక్కడి రియల్ లైఫ్ హీరో ను నిలబెడదాం అని సభ ముఖంగా గ్రంధి శ్రీనివాస్ అభ్యర్ధిత్వాన్ని సీఎం జగన్ ప్రకటించడం తో సభలో హర్షద్వానాలు మిన్ను ముట్టాయి, అంతే కాదు ఇక్కడ పేదల ఇళ్లనిర్మాణాలు కోసం ఇతరాత్ర అభివృద్ధి నిర్మాణాల కోసం ఆయన ఇచ్చిన ప్రతిపాదనలు ఆమోదిస్తూ కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నాను అంటూ వాటి వివరాలను సీఎం జగన్ స్వయంగా చదివి వినిపించడంతో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. సీఎం జగన్ కు నమస్కారం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
