సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఓం శ్రీ మాత్రే నమః భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అనేక మంది అధికారులు, ప్రజా ప్రతినిదులు ( సీఎం పర్యటన నేపథ్యంలో ఇక్కడకు వచ్చినవారు..)దర్శించుకొని శ్రీ అమ్మవారి అస్సిసులు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మాత్యులు కొట్టు సత్యనారాయణ కూడా ఆలయ మర్యాదలతో శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూర్ణకుంభం మరియు పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి యర్రంశెట్టి భద్రాజీ శేషవస్త్రం ఫోటో అందచేసినారు* ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు మరియు ధర్మకర్తలు రామాయణం సత్యనారాయణ, ముత్యాల రామారావు, తాళ్లపూడి భాగ్యలక్ష్మి మరియు జిల్లా (D E O) E సుబ్బారావు పాల్గొన్నారు
