సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: రాబోయే ఏడాది 2022 జనవరిలో బ్యాంకు సెలవులకు సంబంధించిన క్యాలండర్‌ను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) విడుదల చేసింది. ఈ క్యాలండర్ ప్రకారం 2022 జనవరిలో పలు నగరాల్లో పలు తేదీలలో బ్యాంకులు పనిచేయవని పేర్కొంది. ఈ సెలవు రోజుల్లో సంబంధిత బ్యాంకు బ్రాంచులలో నగదును విత్ డ్రా చేసుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి వీలుండదని పేర్కొంది. వారాంతాలు మినహాయించి జనవరిలో తొమ్మిది రోజులు బ్యాంకులు మూసివేయనున్నారు. జనవరి 1, 2022 – కొత్త ఏడాది సందర్భంగా ఐజ్వాల్, చెన్నై, గ్యాంగ్‌టక్, షిల్లాంగ్‌లలో గల బ్యాంకులు మూసివేయనున్నారు. జనవరి 14, 15 తేదీలలో సంక్రాంతి పండుగల సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు అహ్మదాబాద్, చెన్నైలలో బ్యాంకులు మూసివేయనున్నారు.జనవరి 26, 2022 – గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు మినహా అన్ని నగరాల్లో బ్యాంకులకు సెలవు. పైన పేర్కొన్న సెలవు రోజులు మాత్రమే కాకుండా జనవరి 8(2వ శనివారం), జనవరి 22(4వ శనివారం)న బ్యాంకులకు సెలవు. ఇక యధావిదిగా జనవరి 2, 9, 16, 23 30న ఆదివారం కాబట్టి ఆ రోజు కూడా బ్యాంకులు మూతపడనున్నాయి.
