సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీలో నేడు, బుధవారం 2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి రూ.2,86,389 కోట్ల అంచనాతో బడ్జెట్‌నుప్రవేశపెట్టారు. గత . ఐదేళ్లుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్నారు. మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. ఏపీని ప్రజా సంక్షేమము తోపాటు ఆర్థిక అభివృద్ధి లో సంపన్న రాష్ట్రంగా మార్చేందుకు తమ పాలనలో అడుగులు పడ్డాయన్నారు. .పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా మా ప్రభుత్వ చర్యలు తీసుకుంది. ఏపీలో విద్యార్థులను ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేసేలా ఆంగ్ల మాద్యమ విద్యను మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 1000 పాఠశాలల్లోని 4,39,395 మంది విద్యార్థులను సీబీఎస్ ఈ పరిధిలోకి తీసుకొచ్చాం. కొత్త పారిశ్రామిక విధానంతో సంపన్న ఆంధ్రా, రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ చట్టాలతో భూభద్ర ఆంధ్రాగా ఏపీ మారింది’’అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యాంశాలు…రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం.. రూ.30,530 కోట్ల మూలధన వ్యయం.. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు… రూ.55,817 కోట్ల ద్రవ్యలోటు అంచనా.. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51 శాతం మేర ద్రవ్యలోటు… జీఎస్‌డీపీలో 1.56 శాతం మేర రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *