సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో నేడు, శనివారం సాయంత్రం ఎస్పీ ఆడ్మన్ నయీమ్ అస్మి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నేటి ఉదయం భీమవరం రైల్వే జంక్షన్ లో వాహనాల పార్కింగ్ దగ్గర రెండు ధర్మ కోల్ పెట్టలల్లో 207 స్మార్ట్ సెల్ ఫోన్ లు పెట్టి తరలిస్తున్న నిందితుడు మేకల కిషోర్(38) ను అరెస్ట్ చేసి విచారించగా అతడు ఆకివీడు కు చెందిన నాగుల పేదింట్లు నక్క తరుణ్ ల ద్వారా జిల్లా వ్యాప్తంగా దొంగిలించిన సెల్ ఫోన్లు ను పశ్చిమ బెంగాల్ కు చెందిన అబ్దుల్ అజీజ్ కు ఒకొక్క ఫోన్ 5 వేలు చప్పున అమ్ముతున్నట్లు తెలిసిందని, మొత్తం 207 ఫోన్ ల విలువ సుమారు 35 లక్షలు ఉంటుందని తెలిపారు. అందరు నిందితులను అదుపులోకి తీసుకొంటున్నామని, ఈ కేసు ను సమర్ధవంతంగా హ్యాండిల్ చేసిన పోలీస్ అధికారులను అభినందిస్తున్నానని , ఫోన్ దొంగతనం జరిగిన దొంగను పట్టి ఇచ్చే ఆధునిక టెకనాలజి ని వినియోగదారులు వినియోగించుకోవాలని, ఫోన్ పోయిన వెంటనే పిర్యదు చేస్తే తప్పనిసరిగా పట్టుకొనేఅవకాశాలు ఉంటాయని తెలిపారు.
