సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో స్థానిక 21వ వార్డులో 32 లక్షల రూపాయలతో MRO ఆఫీస్ సెంటర్ నుండి యనమదుర్రు డ్రైన్ బండ్ వరకు టౌన్ హల్ వరకు ఇటీవల నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. స్థానిక వ్యాపారులు, కుటుంబీకులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు శాలువాలు కప్పి ,అందరికి స్వీట్స్ పంపిణీచేసి అబినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ఎం శ్యామల, ఎం ఆర్ ఓ తో పాటు వైసిపి నేతలు గూడూరి ఉమాబాల, తోట బోగయ్య, ఏ వి ఆర్ సభాపతి, జంగం మాణిక్యాలరావు, కురుసేటి కాశీ, గంటా సుందర్ కుమార్, పాలపరి జోనా,పెన్నాడ శ్రీను, గుంటి ప్రభు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *