సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇటీవల ప్రతి రోజు వరుస ప్రభుత్వ అభివృద్ధి నిర్మాణ ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాలతో విశేషంగా పాల్గొంటున్న నేపథ్యంలో నేడు, బుధవారం భీమవరం 21వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సీసీ రోడ్డు నిర్మాణనికి శంకు స్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో భీమవరం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వార్డు మహిళలు, ప్రజలు సచివాలయం కన్వీనర్ సచివాలయం సిబ్బంది. వాలంటీర్స్. అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. ఇక రేపు.. గురువారం ఉదయం 9.00 గంటలకు 3 కోట్ల 69 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం విస్సాకోడేరు లే ఔట్ లో ప్రతిష్టాకర “జగనన్న కాలనీలో గ్రావెల్ రోడ్స్’ కు శంకుస్థాపన చెయ్యనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *