సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేడు, శనివారం కొనసాగుతోంది. స్వచ్చ్ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రజావేదిక వద్ద ప్రజలు వేసిన ప్రశ్నలకు సీఎం ముఖాముఖి లోసమాధానాలు ఇచ్చారు. ఒక ప్రశ్నకు సమాధానంగా .. ‘47 ఏళ్ల క్రితం అసెంబ్లీకి వెళ్ళాను. 41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళుతున్నాను. నా జీవితం అంతా అలుపెరుగని పోరాటం. ఇప్పటి వరకు ఎంత పనిచేశానో, రాబోయే 5, 10 ఏళ్లలో అంతకంటే రెట్టింపుగా పనిచేస్తాను. మీ సహకారం ఇవ్వండి. రాబోయే 22 ఏళ్లలో మన రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్‌గా చేస్తాను’ అని చంద్రబాబు తెలిపారు. ఆరోగ్యశ్రీలో కొన్ని టెస్టులు చేయడం లేదని ,.అలాగే పెన్షన్ కోసం సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసినా ఇవ్వడం లేదని మరొకరు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం కాస్త అసహనంగా .. ‘నేను వచ్చింది మీకు బాధ్యతలు కూడా గుర్తు చేయడానికి. ఇలా ఏ సీఎం అయినా నాలాగా వచ్చారా.. ఎవరికైనామీకు ఇలా మైక్ ఇచ్చారా..? 2019లో నన్ను గెలిపించి ఉంటే, మన విభజన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. వైసీపీకి అధికారం ఇస్తే అప్పులు చేసి ఏపీని అంధకారంలోకి నెట్టేశారని ఆరోపించారు. స్వచ్ఛాంధ్ర ఉద్యమం కోసం ప్రజలు సహకరించాలని మన ఆరోగ్యానికి కల్తీ తిండి, తాగేనీరు, అపరిశుభ్రత వలన ఇబ్బందులు వస్తున్నాయని ఆరోగ్య శ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్‌తో 25 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు తణుకు ఎన్టీఆర్‌ పార్క్‌ను తాను డెవలప్ చేశానని.. కానీ దానిని నాశనం చేశారని ఆరోపించారు. ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం.. పశువులు వాటిని తిని, చనిపోతున్నాయి. ప్లాస్టిక్ వలన తినే తిండి కూడా విషం అయిపోతున్నది. క్యాన్సర్ వచ్చినప్ఫుడు బాధ పడుతున్నాం. కానీ క్యాన్సర్ కారణమైన ఆహారం గురించి ఆలోచించాలి. రాష్ట్రంలో క్యాన్సర్ రాకుండా చేయడానికి నోరి దత్తాత్రేయుడుని సలహాదారుగా నియమించాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై యుద్ధమే చేయాలి నిషేదిత ప్లాసిక్ వినియోగానికి ప్రజలు దూరంగా ఉండాలి అని పిలుపు ఇచ్చారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *