సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాలలో పర్యటనకు నేడు, శుక్రవారం జిల్లాలో ప్రవేశించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబును ప్రజాగళం ర్యాలీలో బీజేపీ నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మర్యాదపూర్వకంగా కలసి ఆయనకు జిల్లా పర్యటనకు స్వాగతం పలికారు. చంద్రబాబు తో కొద్దిసేపు ఎన్నికలలో తాజా పరిస్థితులపై చర్చించారు. ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయానికి చంద్రబాబు పర్యటన మరింత ద్రోహదం చేస్తుందని, ప్రధాని మోడీ సారధ్యంలో కూటమి లోని పార్టీలు బీజేపీ టీడీపీ , జనసేన పార్టీల క్యాడర్ సమన్వయంగా కలసి పనిచేస్తే జిల్లాలో అందరు కూటమి అభ్యర్థుల విజయాలు సాధ్యమేనని ప్రజలు కూటమి పక్షానే మద్దతుగా ఉన్నారని వర్మ అభిప్రాయపడ్డారు.
