సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గం ఉండి మండలం మహదేవపట్నం గ్రామపంచాయతీ పరిధిలోని రామచంద్రపురంలో శ్రీమతి గుర్రం నారాయణమ్మ కళ్యాణ వేదికలో జరిగిన బిసిల అత్మీయ సమావేశంలో నరసాపురం పార్లమెంట్ వైఎస్సార్సిపి అభ్యర్ధిని శ్రీమతి గూడూరి ఉమాబాల, డిసిసిబి చైర్మన్ మరియు ఉండి అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్ధి ,పివిఎల్ నరసింహరాజుతో కార్యాకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమాబాల మాట్లాడుతూ.. “రాష్ట్రంలో అన్నివర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు చేసిన ఘనత ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి దక్కిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వారి రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉండి లోని వివిధ సంఘల ప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు వార్డ్ మెంబెర్ లు, పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు
