సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి చేప్పట్టిన చిరంజీవి 2014 లో పదవి కాలం ముగిసాక కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయనప్పటికీ రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవల సీఎం రమేష్ , పంచకర్ల వంటి పలువురు కూటమి అభ్యర్థులను గెలిపించాలని. ఏపీలో చంద్రబాబు, పవన్, మోడీ కూటమి కట్టడం మంచి పరిణామం అంటూ పేర్కొంటూ చిరంజీవి తొలిసారి రాజకీయ వీడియో ప్రచారం తాను నివాసం ఉండే హైదరాబాద్ నుండి ప్రారంభించడం గమనార్హం.. ఇక రాజకీయాలలో మరో ముందడుగా గా సోదరుడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మే నెల 5వ తేదీన పిఠాపురంలో చిరంజీవి తన సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబు తో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని? తాజా సమాచారం. దీనికోసం తూగో జిల్లా మెగా అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిని చిరంజీవి అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే పిఠాపురం లో రాజకీయ ఉద్దండురాలు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వంగా గీత నువ్వా- నేనా స్థాయిలో పోటీ ఇస్తున్న నేపథ్యంలో జనసేన లో మరింత జోష్ కోసం చిరంజీవి పర్యటన అవకాశాలు మాత్రం ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఎన్నికలలో ఆసక్తికర పరిణామం ఏమిటంటే .. ఇదేస్థానం నుంచి కోనేటి పవన్ కల్యాణ్, కనుమూరి పవన్ కల్యాణ్ నామినేషన్లు వేశారు. వారు కూడా టీ గ్లాస్ లాగా కనపడే బకెట్, లాంటి గుర్తులు కోరుకొంటున్నారు. దీంతో ఓటర్లు తికమకపడే అవకాశం ఉంది. ఇలాగె గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ వేయగా, దాదాపు అదే పేరుతో ఉన్న మరో వ్యక్తి వల్లభనేని మోహన్ శ్రీకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గుంటూరు జిల్లాలో విడుదల రజనికి పోటీగా మరో విడుదల రజని.. ఇలా రాజకీయ తెలివితేటలు..
