సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లో క్యూ లో నిలబడి టికెట్ తీసుకుంటున్న ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైల్వే శాఖ గతంలోనే తీసుకొచ్చిన యూటీఎస్ (అన్ రిజర్వర్డ్ టికెటింగ సిస్టమ్) యాప్ లో తాజాగా మార్పులు చేసింది. ప్రయాణికులు క్యూలో నిబడకుండానే ఈ యాప్ ద్వా రా జనరల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అయితే స్టేషన్కు రెండు మూడు కిలోమీటర్లదూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉండేది. దీంతో పండగలు వేళా, బాగా రద్దీ సమయాలలో ప్రయాణికులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు రైల్వే శాఖ నిర్ధారించింది. తాజాగా రైలు ఫ్లాట్ పారం కు ఎన్ని కిమీ దూరంలో ఉన్నా సరే, టికెట్ పొందేలా యాప్ అప్డేట్ చేశారు. దాంతో ఇం ట్లో ఉండగానే కంగారుపడకుండా జనరల్ టికెట్ బుక్ చేసుకుని రైలు వచ్చే సమయానికి స్టేషన్కు వస్తే సరిపోతుంది.
