సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:. ఇటీవల ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించిన మీడియం బడ్జెత్ సినిమాలు భారీ అంచనాలతో 2 సినిమాలు విడుదల అయ్యాయి. అవి ఇప్పుడు ఓటిటి ప్లాట్ పామ్ మీదకు తాజాగా వచ్చేసాయి. వాటిలో ‘టిల్లుస్క్వే ర్ కీలకమైనది. ‘డీజే టిల్లు’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన జొన్నలగడ్డ సిద్ధు.. దీని సీక్వె ల్గా ‘టిల్లుస్క్వేర్’ తీశాడు. చాలాసార్లు వాయిదా పడి మార్చి 29న థియేటర్లలోకి వచ్చింది. ఊహించని విధంగా రూ.100 కోట్ల వసూళ్లు దిశగా దూసుకొనిపోతుంది. మరి ఈ సినిమా తాజగా నెట్ ఫ్లెక్స్ లో విడుదలయింది. మంచి ఫన్ తో ..చూసి యూత్ కడుపుబ్బా నవ్వు కోవడానికి బాగుంటుంది. ఇక ఇటీవల కాలంలో హిట్స్ లేక వెనుకబడిన విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్‘. మృణాల్ ఠాకుర్ హీరోయిన్. పరుశురాం దర్శకుడు అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. ఇప్పు డు ఈ సినిమాతాజగా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక, గోపీచంద్ హీరోగా ఇటీవల విడుదల అయిన మాస్ మసాలా సినిమా భీమా కూడా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వేసవి లో ఇంటిపట్టునే ఇక ఇంట్లోనే చూసెయ్యండి మరి..
