సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భీమవరం యూనిట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ జి.శశికాంత్ ఉచిత మెడికల్ క్యాంపు స్థానిక అసోసియేషన్ భవనం నందు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడుతున్న సుమారు 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసి యున్నారు. భీమవరం ఒమిక్స్ ల్యాబ్ వారిచే ఉచితంగా బి.పి. మరియు షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్. టి.ఒ. రవివర్మ, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎస్.ఎన్. రాజు మండల యూనిట్ ప్రధాన కార్యదర్శి పి.సీతారామరాజు, కోశాధికారి సూర్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి భాస్కరరావు, యు.జి.సి. పాండురంగరాజు, చంద్రరావు, జయరాజు, వెంకట్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *