సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈరోజు ఉదయం భీమవరం మండలంలోని కొవ్వాడ, నరసింహపురం, చినఅమిరం, రాయలం గ్రామలలో ప్రభుత్వ విప్ మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ తో కలసి ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో పూలు హారతులతో అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభ్యర్థులు ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ.. జగన్ ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చారని, ప్రజల ఇంటికే వెళ్లి పింఛను లు రేషన్ ఇచ్చే సంప్రదాయం ను శ్రీకారం చుడితే.. అధికారంలో ఉన్నపుడు ప్రజలకు నరకం చూపిన చంద్రబాబు పవన్ తో కలసి ఇప్పుడు సిగ్గు వదిలేసి..ప్రజా సంక్షేమం కోసం జగన్ బాటలోనే నడుస్తానని, జగన్ పధకాలు తీసే దమ్ము లేదని, కూటమి అధికారంలోకి వస్తే పింఛను లు పధకాలు ఇంకా పెంచి ఇస్తానని దొంగహామిలు ఇస్తూ మరో మోసానికి శ్రీకారం చుడుతున్నారని ప్రజలు గమనించాలని ..ప్రజా బలం లేక దొంగ సర్వేలు వేసుకొని జబ్బలు చరుచుకొంటున్నారని ఎన్నికల ఫలితాలు వచ్చాక వారికీ బొబ్బలు మాత్రమే మిగులుతాయి. నిజాయితీ గా పాలన అందించే జగన్ సర్కార్ ను బలపరుస్తూ 2 ఓట్లు కేవలం ఫ్యాను గుర్తుకు మాత్రమే వెయ్యాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు
