సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన, బీజేపీ బలపరచిన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘురామా కృష్ణంరాజు ఉండి నియోజకవర్గంలోని నేడు, బుధవారం కాళ్ళ మండలంలో కోమటిగుంట గ్రామంలో జరిగిన “ఆత్మీయ సమావేశం”లో పాల్గొన్నరు. ఈ సందర్భముగా ఎంపీ రఘురామా మాట్లాడుతూ.. చంద్రబాబు సమర్ధుడైన సీఎంగా ప్రధాని మోడీ కూడా ప్రశంసించడం చూస్తున్నామని రాబోయే రోజులలో ఎన్డీయే కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం అని .. ప్రజల అస్సిర్వాదాలతో తాను ఎమ్మెల్యే గా రాగానే ఉండి ని మరింత అభివృద్ధి పధంలో నిలబెడతామని, ఇప్పటికే ఎంపీ నిధులను కోట్లాది రూపాయలు మంజూరు చేసి రోడ్డులు . వంతెనలు కమ్యూనిటీ హాలులు , రైతు సంక్షేమానికి వారి అభివృద్ధి లో తన వంతు కృషి చేసానని , ఆక్వా రైతుల కోసం తన కృషిని కొనసాగిస్తానని ప్రజా సంక్షేమం పధకాలు అందిస్తానని హామీలు ఇచ్చారు.సైకిల్ గుర్తు ఫై ఓట్లు వేసి తనను భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ జుత్తుగ నాగరాజు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *