సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల స్వర్ణాంధ్ర కార్యాలయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నేడు (సోమవారం) వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్చాంధ్రను అమలు చేస్తున్నామని తెలిపారు. డీప్ టెక్‌తో టెక్నలజీ బాగా పెరిగిందన్నారు. వాట్సప్ గవర్నెన్స్‌తో ఆన్‌లైన్ సేవలు అందుతున్నాయని తెలిపారు. వచ్చే రెండు నెలల్లో అన్ని సర్వీస్‌లు వాట్సప్‌లో ఉంటాయని తెలిపారు. . రాబోయే రోజుల్లో డేటా నాలెడ్జి, టూల్స్ అన్ని రెడీగా ఉంటాయని అన్నారు. టెక్నాలజీ అనేదీ ఫ్యాషన్ కాదు.. గేమ్ ఛేంజర్ అని తెలిపారు. పేదరికం లేని ఏపీని తయారు చేస్తామని.. అందుకే పీ4 కార్యక్రమం తీసుకువచ్చామని అన్నారు. ఆదాయం పెరగాలని ఆరోగ్యం, ఆనందం ఉండాలని ఆకాంక్షించారు. 26 జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ విజన్ డాక్యుమెంట్ తయారైనట్లు , రోడ్ మ్యాప్ మండలాల వారీగా కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధమైనట్లు చెప్పారు మరొకొన్ని జిల్లాల్లో ఆక్వా, డైరీ ఇలా అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించుకోవాలని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, హాస్పిటల్, టూరిజం ఇలా అన్ని రంగాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
