సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ బియ్యం మాఫియా కాకినాడ కేంద్రంగా జరుగుతుందని అధికార అండతో వేలాది కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్న స్థానిక దొంగల రాజ్యాన్ని తాము అధికారంలోకి రాగానే తరిమి కొడతామని ప్రకటించిన నేపథ్యంలో.. ఇంతలో గత నెలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జనసేన పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాలశాఖ మంత్రి కావడం అందరికి తెలిసిందే.. ఇక నాదెండ్ల స్వయంగా బరిలో దిగారు. రేషన్‌ బియ్యం మాఫియా కాకినాడ కేంద్రంగా జరుగుతోందని, ద్వారంపూడి కుటుంబం చేస్తున్న బియ్యం అక్రమాలు భారీగా ఉన్నాయని మంత్రి నాదెండ్ల అధికారికంగా ప్రకటించిన కొన్ని రోజుల వ్యవధిలోనే అసలు గుట్టు బయట పెట్టారు. గత నెలాఖరున కాకినాడ పర్యటనకు వచ్చిన ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారులకు సైతం తెలియకుండా నేరుగా కాకినాడ యాంకరేజ్‌ పోర్టుకు వెళ్లారు. తనకు రహస్యంగా అందిన సమాచారం మేరకు నౌకల ద్వారా విదేశాలకు ఎగుమతి అవడానికి సిద్ధంగా బార్జిల్లో ఉన్న బియ్యాన్ని పరిశీలించారు. ఆ తర్వాత పోర్టు సమీపంలోను, కాకినాడ రూరల్‌ పరిధిలోని ఎనిమిది గోదాము ల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఒక్కో గోదాముల్లో వేల టన్నుల బియ్యం ఎగు మతి సిద్ధంగా ఉండడంతో అనుమానం వచ్చిన కొన్ని బస్తాలను స్వయంగా తనిఖీ చేశారు. వీటిలో చాలావరకు రేషన్‌ బియ్యం ఉన్నట్టు గుర్తించి ఎనిమిది గోదాముల్లో 39,870 టన్నుల బియ్యం సీజ్‌చేశారు. ఇందులో అశోకా, హెచ్‌1 గోదాముల్లోనే 5,300 టన్నులు సీజ్‌చేశారు. సీజ్‌చేసిన మొత్తం 39,870 టన్నుల బియ్యంలో 12,184 టన్నుల్లో రేషన్‌ బియ్యం కింద సరఫరా చేసిన ఫోర్టిఫైడ్‌ బియ్యం ఆనవాళ్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏడు గోదాముల యాజమాన్యాలకు జిల్లా పౌర సరఫరాలశాఖ నోటీసులు పంపించింది.సీజ్‌ చేసిన శాంపిళ్లన్నీ ల్యాబ్‌ టెస్ట్‌లో ఫోర్ట్‌ఫైడ్‌ కెర్నెల్‌ బియ్యంగా తాజాగా నిర్ధారణ కావడంతో దీని వెనుక ఉన్న పెద్ద మనుషులను అరెస్ట్ చేసేందుకు నాదెండ్ల రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఇంతా చేసి అధికార బలంతో మరో బియ్యం మాఫియా రాకుండా చూడాలి..ప్రతినెలా కుత్రిమ డిమాండ్ పెంచి బియ్యం ధరలు పెంచేస్తున్న బియ్యం హోల్ సెల్ వ్యాపారుల సంగతి తేల్చాలి. ప్రజలకు డైరెక్ట్ ప్రయోజనం ఉండాలి. మధ్య తరగతి ప్రజలకు అందుబాటు లో ప్రెవేటు బియ్యం ధరలు కట్టడి చేస్తే మేలు జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *