సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ఖ్యాతి గాంచిన, భీమవరంలోని శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ యొక్క 7వ గ్రాడ్యుయేషన్ డే “విష్ణోత్సవ్ 2K24” ను నేడు, శనివారంది. 10.08.2024 తేదీన కళాశాల యొక్క దక్షిణ క్యాంపస్ లోని విష్ణు కన్వెన్షన్ సెంటర్ నందు వైభవంగా నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీనివాస రావు తెలిపారు. . ఈ కార్యక్రమంలో 2020-24 బ్యాచ్‌కు చెందిన 883 మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు, అలాగే 2022-24 బ్యాచ్‌కు చెందిన 18 మంది ఎం.టెక్. విద్యార్థులు మరియు 60 మంది ఎం.బి.ఏ. విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికేట్‌లను ప్రదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్-చైర్మన్, ఆర్ రవిచంద్రన్ ముఖ్య అతిథిగా సొసైటీ కార్యదర్శి, ఆదిత్య విస్సమ్ గౌరవ అతిధులుగా పాల్గొన్నారు. వారు ఇరువురు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ…కేవలం ఉద్యోగాలపైనే దృష్టి పెట్టకుండా మంచి పారిశ్రామికవేత్తగా ఎదిగే ఉన్నత ఆలోచనలను కలిగి ఉండాలని సూచించారు. ప్రపంచం చాలా విస్తారమైనదై అనేక అవకాశాలను అందిస్తుందని,ప్రస్తుతం పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతుందని, అవకాశాలను చేజిక్కించుకొని, విజయవంతమైన పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని సూచించారు. ముందుగా స్టార్టప్‌ల గురించి ఆలోచించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో మొత్తం 961 మంది పట్టభద్రులు, అలాగే 2800 కుపైగా తల్లిదండ్రులు హాజరుఅయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీవిష్ణు ఇంజినీరింగ్‌ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్‌ జి. శ్రీనివాసరావు , డైరెక్టర్ – స్టూడెంట్ ఎఫైర్స్ & అడ్మిన్, డాక్టర్‌ పి.శ్రీనివాసరాజు, వైస్-ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. వెంకటరామరాజు , డీన్స్‌, వివిధ విభాగాధిపతులు, కంట్రోలర్ అఫ్ ఎగ్సామినేషన్స్, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *