సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, సోమవారం నవరాతులు పూర్తీ చేసుకొన్నా పందిళ్ళ లోని గణేష్ విగ్రహాల నిమజ్జనాల కోలాహలం ఘనంగా జరిగింది. విస్సాకోడేరు కాలువ, ఉండి రోడ్డు పంటకాలువలలో అనేక విగ్రహాల నిమజ్జనాలు తీన్మార్ శబ్దాలతో యువకుల నృత్యాల కోలాహలంతో జై గణేష్ నినాదాలతో ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానము యొక్క ఉపాలయము అయిన శ్రీ విగ్నేశ్వరస్వామి స్వామి వారి గణపతి నవరాత్రుల మహోత్యవాలలో ఆఖరి రోజు లో భాగంగా నేటి సోమవారం ఉదయం వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ను స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ప్రారంభించారు. తదుపరి శ్రీ స్వామి వారి నిమజ్జన కార్యక్రమాన్ని శాశన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు తనయుడు కొయ్యే సుందరరాజు ప్రారంభించారు. ఆలయసహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ వీరికి ప్రసాదాలు శేషవస్త్రం అందజేశారు.
