సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 73 ఏళ్ళ వయస్సులో కూడా విజయాలు సాధిస్తున్న తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ గ‌త ఏడాది ‘జైల‌ర్’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత కొత్త చిత్రం ‘వేట్టైయాన్’ (Vettaiyan- HUNTER). తెలుగువారికి ఇది డబ్బింగ్ సినిమా అని ముందే చెప్పేస్తూ అదే తమిళ టైటిల్ తో విడుదల చెయ్యడం విశేషం. నేడు, గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జై భీమ్’ వంటి క‌ల్ట్ చిత్రాన్ని అందించిన‌ టీ.జె.జ్ఞాన‌వేల్ ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా భారీ బ‌డ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. కీలక పాత్రలలో అమితాబ్ బ‌చ్చ‌న్, దగ్గుబాటి రానా, మరియు జు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్ రితికా సింగ్‌, రోహిణి, అభిరామి ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కధ విషయానికి వస్తే.. అదియన్‌ (రజనీకాంత్‌) కన్యాకుమారిలో ఎస్పీగా ఉద్యోగం చేస్తారు. ఎంతటివారైనా సరే ..తప్పు చేశారని తేలితే ఎన్‌కౌంటర్‌ పక్కా. చిన్న పిల్లలకు చదువు ముఖ్యం, అని పేద విద్యార్ధుల కోసం నిలబడే స్కూల్‌ టీచర్‌ శరణ్య (దుషారా విజయన్‌). తను పని చేసే స్కూలో ప్రాంగణంలో గంజాయి మాఫియా ఉందని తెలుసుకుని ఫవర్‌ఫుల్‌ ఆఫీసర్‌ అయిన అదియన్‌కు లేఖ రాస్తుంది. అయన సత్తా చూపిస్తాడు. అయితే శరణ్య చెన్నైకి ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అక్కడ తనను కిరాతకంగా మానభంగం చేసి చంపుతారు. శరణ్య చావుకి కారణం ఎవరు? నాట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌కి శరణ్య మరణానికి ఉన్న సంబంధం ఏంటి?. గుణ అనే ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ అదియన్‌ చేతిలో ఎందుకు ఎన్‌కౌంటర్‌ అయ్యాడు. దానిపై న్యాయమూర్తి సత్యదేవ్‌ (అమితాబ్‌ బచ్చన్‌ ) నేతృత్వంలో విచారణ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు. అన్నది వెండి తెరపై చూడవలసిందే.. ముఖ్యంగా నేటి ఆధునిక టెక్నాల‌జీని ఉప‌యోగించుకుని హ‌త్య‌లు చేస్తున్న ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్‌ను ప‌ట్టుకునే నేప‌థ్యంలో సాగే క‌థతో ర‌జ‌నీకాంత్‌తో జ్ఞాన్‌వే ల్ రాజా ఒక ప్ర‌యోగం చేశాడ‌ని చెప్పాలి. అమితాబ్ తక్కువ నిడివి పాత్ర హుందాగా పోషించారు. సినిమా ప్రధమ భాగం బాగా నెమ్మదిగా నడుస్తుంది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ బాగుంది. సెకండ్ హాఫ్ కాస్త వేగం పెరిగింది. విద్య వ్యవస్థలో లొసుగులు ఇటీవల జరిగిన దేశంలో కొన్ని ఘటనలు ప్రేరణగా సినిమాను నిర్మించారు. తమిళ వాసనా బాగా కొడుతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం ఎక్కుతుందో చూడాలి.. సినిమాకు అనిరుధ్ మంచి సంగీతం అందించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *