సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో గత వారం రోజులుగా పోలీసు అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నేడు, మంగళవారం సాయంత్రం నుండి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు “కొవ్వొత్తుల ర్యాలీ” కార్యక్రమం చక్కగా నిర్వహించారు. పోలీసులతో పాటు స్వచ్చందంగా పలువురు ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ సేవకు ప్రజల సేవకు, ప్రజా రక్షణకు అసాంఘిక శక్తులతో పోరాడి ప్రాణాలు పణంగా పెట్టిన పోలీస్ వీరులకు ఘన నివాళ్లు అర్పించారు.
