సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి ఉగ్ర ప్రవాహం కొనసాగుతోంది. 50.80 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వరద ఉధృతి 13,01,496 క్యూసెక్కులకు చేరుకుంది. భద్రాచలం నుంచి ఆంధ్రా ఒడిషా, ఛత్తీస్ గడ్ కు, దుమ్ముగూడెం హైవే కు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు రాజమహేంద్ర వరం ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రమాద భరితంగా ప్రవహిస్తుంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12.49 లక్షల క్యూసెక్కులు కావడం గమనార్హం. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 200 టీఎంసీలకు చేరితే గేట్లు ఎత్తేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నేడు, శనివారం, గేట్లు ఎత్తివేత కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరుకానున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి అత్యవసర సహాయక చర్యల కోసం AP స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ 1070,112,18004250101 నెంబర్లు సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
