సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకప్రక్క కార్తీక మాస నేపథ్యంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో, టమాటా కూడా కిలో 50 రూపాయలకు చేరుకొంటుటే, మరో ప్రక్క ఆరటి పంటకు ప్రసిద్ధి పొందిన అనంతపురం జిల్లాలో రైతులు రవాణా ఖర్చులు దండగా అని భావించి అరటి కాయలను రోడ్లపై పారబోస్తున్నారు రైతులు. దేశ, విదేశాల్లో అనంతపురం జిల్లాలో పండించే అరటికాయలు ను డిమాండ్ ఎక్కువగా ఉండడంతో.. తాడిపత్రి నుంచి ఏకంగా ఓ బనానా ట్రైన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే అరటి ధరలు భారీగా పడిపోయాయి.. టన్ను అరటి పండ్ల ధర 28 వేల నుంచి ఏకంగా 1000 రూపాయలకు పడిపోవడం గమనార్హం. దీంతో కిలో అరటిపండు ధర హోల్సేల్ మార్కెట్లో రూపాయికి పడిపోయింది. అంటే ఒక్క రూపాయికి 3 అరటికాయలు వస్తాయి. . అరటి రైతులకు ఈ ఏడాది ఎంత ఆధ్వానంగా ఉందో చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలు.. ఇక్కడ రైతులు పండించిన అరటి పండ్లు కూడా డజను 10 రూపాయలు మించి ధర పలకటం లేదు. మన గోదావరి జిల్లాలలో ఈ కార్తీకమాసం లో మంచి అరటి పళ్ళు డజను 70-80 రూపాయలు తక్కువ లేదు మరి..
