సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక్క రాష్ట్రము మినహా.. ఈ రోజు ఫలితాలు వెలువడిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క తెలంగాణ మినహా 3 రాష్ట్రాల లో బీజేపీ అధికారంలోకి వచ్చి మరో 4నెలలు లో రానున్న లోక్ సభ ఎన్నికలకు ముందే తన దమ్ము చూపించింది. నిజానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని అందరికి తెలిసిందే.. దానికి తగ్గితే బీజేపీ తన మార్క్ ప్యూహంతో అక్కడ గెలిచింది. ఇక చత్తీస్ ఘడ్ లో మాత్రం కాంగ్రెస్ వరసగా రెండోసారి అధికారాన్ని సంపాదించుకోవచ్చని ప్రీ పోల్ సర్వేలు చెప్పాయి! వాటి సర్వే తప్పని నిరూపించింది బీజేపీ.. ఉత్తరాదిన ప్రధాని మోడీ ప్రభంజనాన్ని.. ఆమ్ ఆద్మీ.. తప్ప ఇంకెవరు నిలబడలేరని ఈ ఎన్నికలు నిరూపిస్తున్నాయి. అయితే.. ఇదే ఊపులో కాంగ్రెస్ కు ఊపిరి సలపకుండా బీజేపీ లోక్ సభ ఎన్ని కలకు వెళ్లవచ్చ నే విశ్లేషణలు జాతీయ స్థాయిలో వినిపిస్తున్నాయి. ఎలాగూ తెలంగాణాలో ప్రాంతీయపార్టీ బి ఆర్ ఎస్ ను కాంగ్రెస్ ఓడించింది కాబ్బటి అక్కడ బీజేపీ కి మైనెస్ కాదు.. అయితే జాగ్రత్తగా గమనిస్తే దక్షిణాదిన కాంగ్రెస్ పూర్వ వైభవం తెచ్చుకొంది. కర్ణాటక, తెలంగాణ తో పాటు తమిళనాడు లో డీఎంకే ప్రభుత్వ భాగస్వామిగా కొనసాగుతుంది. దక్షిణాదిన బీజేపీ ప్రభావం తగ్గించింది... సిగ్మా ప్రసాద్ కాలమ్స్
