సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, గురువారం చిన అమిరం గ్రామంలో సుమారు మూడు కోట్ల 63 లక్షల నిధులతో నిర్మించిన 15 సీసీ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామాన్ని కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో భాగంగానే గత నాలుగున్నర ఏళ్లుగా కోట్లాది రూపాయలతో ఈ గ్రామంలో సిసి రోడ్లు, డ్రైన్ లు నిర్మించడం జరిగిందన్నారు. మరో పక్క సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబ కూడా సంతోషంగా ఉండాలని, ఆర్థికంగా ఎటువంటి కష్టాలు వారు అనుభవించకుండా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ప్రతి కుటుంబానికి కూడా లక్ష నుండి 5 లక్షల వరకు మేలు జరిగే విధంగా నవరత్న పథకాలను సీఎం జగన్ అందిస్తున్నారని, ప్రజలు ను ఎప్పుడు మోసం చేసే చంద్రబాబు మోసపూరిత మాటలను నమ్మవద్దు అని అతను ఈ సంక్షేమ పధకాలను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నాడని, పచ్చ గ్యాంగ్, ఇటీవల ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగేలా రాష్ట్రంలో ఉద్యమాలు రెచ్చగొడుతున్నారని, అంగన్వాడీ వర్కర్స్ ఆందోళన వెనుక కొన్ని శక్తులు ఉన్నాయి . ప్రతిపక్షల వక్ర బుద్దిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
