సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో 4 రోజులలో ఎన్నికల కోడ్ అమలు లోకి వస్తున్నా నేపథ్యంలో.. భీమవరం నియోజకవర్గం లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రభుత్వ నిధులతో పూర్తీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా ప్రారంభిస్తున్నారు. మరి కొన్ని చోట్ల నిధులు కేటాయింపులు జరిగిన చోట పనులకు శంకుస్థాపన లు చేసి శరవేగంగా తన హయాంలోనే పనులు పూర్తీ కావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమృత నిధులతో, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పూర్తీ చేసిన 3 కోట్ల 82 లక్షల రూపాయలతో 38,39 వార్డులో నిర్మించిన వాటర్ ట్యాంక్ లు మరియు సిసి రోడ్డు ప్రారంభోత్సవలలో నేటి సోమవారం సాయంత్రం పాల్గొన్నారు. స్థానిక యువత ,కార్యకర్తలు, మహిళలు చిన్నారులు ఆయనకు పూలవర్షం కురిపిస్తూ ప్రారంబోత్సవాల పట్ల తమ హర్షం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు అందరు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *