సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల అమరావతే మాత్రమే రాజధాని అంటూ హైకోర్టు చేస్తున్న అభ్యన్తరాలఫై సుప్రీంకోర్టు లో ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలుచేసింది. అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంటే… 3 రాజధానులపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీ కి లేదని హైకోర్టు తీర్పును వెలువరించింది. అలా చేయడమంటే శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ సర్కార్ పేర్కొంది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది.సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలంటూ.. హైకోర్టు సూచించడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని , ఇది శాసనఉల్లంఘన క్రింద భావిస్తున్నట్లు సర్కార్ పేర్కొంది.అయితే ఎట్టి పరిస్థితులలో 3 రాజధానులు ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్న జగన్ సర్కార్ లక్ష్యానికి సుప్రీం కోర్ట్ లో ఎటువంటి తీర్పు రానునుందో?
