సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఈరోజు విజయదశమి పర్వదినం నేపథ్యంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పిలుపు మేరకు భీమవరం నియోజక పరిధిలోని ప్రముఖ వైసిపి నేతలు, ప్రజా ప్రతినిదులు నేడు, బుధవారం ఉదయం 11.00 గంటలకు శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం కు చేరుకొన్నారు. శ్రీ అమ్మవారిని దర్శించుకొని .. మన భీమవరం తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆలోచనలకూ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో ‘మూడు రాజధానులు’ ఏర్పాటు చేయాలన్న సంకల్పానికి మహాశక్తి ఆశీర్వాదం కూడా తోడవ్వాలని కోరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. … మరోపక్క ఒక్క ప్రాంతానికే అభివృద్ధి పరిమితం కావాలని స్వార్ధంతో అక్కడే అభివృద్ధి కోరుకొంటున్న ఒక వర్గం మనస్సులు మారాలని విజయాలకు నెలవైన విజయదశమి రోజున ప్రత్యేక పూజలు చేసినట్లు, శ్రీ అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి విన్నవించుకొన్నామని వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు తెలిపారు.
