సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో గత మూడు రోజులుగా నష్టాలను ఎదుర్కొన్నస్టాక్ మార్కెట్ సూచీలు నేడు, బుధవారం ఉదయం కాస్త తడబడిన తరువాత లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు స్టాక్ మార్కెట్‌ను ముందుకు నడిపించాయి. గత మంగళవారం ముగింపు (80, 737)తో పోల్చుకుంటే బుధవారం చివరకు సెన్సెక్స్ 260 పాయింట్ల లాభంతో 80, 998 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 77 పాయింట్ల లాభంతో 24, 620 వద్ద రోజును ముగించింది. హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు ప్రధాన సూచీలను ముందుకు నడిపించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 407 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 76 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.90గా ఉంది.
.
