సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: దేశంవ్యాప్తంగా ఇప్పటికే మరోసారి యాక్టీవ్ కరోనా పోజిటివ్ కేసులు 30వేలు దాటిపోవటంతో ఆందోళన మొదలయింది. కోవిద్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సమీక్షా సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య సదుపాయాల సన్న ద్ధతను సమీక్షిం చాలని సూచిం చారు. రేపు సోమవారం , మంగళవారం దేశ్యవ్యాప్తంగా ప్రభుత్వ , ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను అంచనా వేయడానికి కరోనా రోగులను ఆడుకొనే మాక్ డ్రిల్ చేపట్టనుందని స్పష్టం చేసారు. . ఐసియూలో పడకలు, ఆక్సిజన్ సరఫరా, వాటి , సంసిద్ధతపై వారానికోసారి సమీక్ష జరుగుతుందని ప్రకటించారు. మరోవైపు.. కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లోమాస్క్ ధరించడాన్ని తప్పనిసరిగా చేశాయి. కేరళ, హర్యానా, పాండిచ్చేరి రాష్ట్రాలలో ఇకపై మాస్క్ తప్పనిసరి చేసారు. గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్ప ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కు లు ధరించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తాజగా ఆదేశాలు జారీ చేసాయి.
