సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నేడు, బుధవారం కాకినాడలో వృద్దులకు పింఛన్స్ విడుదల చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా .. 66 లక్షల 34వేల మంది లబ్దిదారులకు ఈ ఏడాది నుండి నెలకు 3000 రూపాయలు చప్పున వేస్తున్న పింఛను డబ్బులు బటన్ న్రోక్కి రాష్ట్రంలోని వార్డు సచివాలయాలు కు విడుదల చేసారు. ఈ సందర్భముగా రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభనుద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ.. 2019 లో మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2250 రూపాయలుకు పెంచిన పించను ఈ ఏడాది నుండి ప్రతి నెల 3000 రూపాయలకు చేరుకోందని తాను అవ్వాతాతలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొన్నానని, అలాగే వృద్దులకు ఇండ్లవద్దకే వెళ్లి వాలంటీర్లు ఆ పింఛను ఇచ్చే మంచి సంప్రదాయం దేశంలో మరెక్కడ లేదని అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం లో ప్రజలు ఏ పధకం పొందాలన్న లంచం ఇవ్వాలని, టీడీపీ కి చెందినవారు అయి ఉండాలని తాను అధికారంలోకి వచ్చాక నేరుగా అర్హత ఉన్న ప్రతి లబ్దిదారులకు డబ్బు , సంక్షేమం అందే ఏర్పాటు చేశామన్నారు. చంద్రబాబు అవినీతిలో దత్త పుత్రుడు కూడా పార్టనర్ అని అందుకే బాబు ఎంత అవినీతి చేసిన ప్రశ్నించడు .. ఆయన అవినీతి ఫై ప్రధానికి లేఖలు రాయలేదు అని విమర్శించారు. చంద్రబాబు దొంగల ముఠా అధికారం కోసం రాగాల రోజులలో మరింత చెలరేగి అబద్దాలు ప్రచారం చేస్తారని, కుటుంబాలను విడదీస్తారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైసిపి కి అండగా ఉండాలన్నారు.
