సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగ మొదలుకొని జనవరి 13 నుండి పిబ్రవరి 14 వతేది శుక్రవారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 61 వ వార్షిక జాతర మహోత్సవాలు లో అప్పుడే నెల రోజుల వేడుకలలో మూడింట 2వంతులు పూర్తీ అయ్యాయి. ఈనేపథ్యంలో గత శనివారం నుండి భక్తులు సంఖ్యా మరింత పెరిగిపోయింది. గత రాత్రి 10గంటల వరకు వేలాది మంది భక్తులు భారీ క్యూ లైన్ లలో నిలబడి శ్రీ అమ్మవారిని దర్శించుకొన్నారు. నేటి ఆదివారం ఉదయం నుండి దూరప్రాంతాల నుండి భక్తులు విశేషంగా వచ్చి శ్రీ అమ్మవారిని దర్శించుకొంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఒకింత సెట్టింగ్స్ తక్కువగా ఉన్నపటికీ, అలాగే గత ఏడాది నుండి సినీ కళాకారుల సన్మానాలు నింపివేసినప్పటికీ , ఉత్సవాలకు కనివిని ఎరుగని రీతిలో భక్తులు హాజరు అవుతున్నారు. శ్రీ అమ్మవారి దర్శనం తో పాటు ఉత్సవ చలువ పందిళ్ళలో ఏర్పాటు చేసిన నాటక, సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షించడానికి ఇతరాత్ర భారీ సెటింగ్స్, లైటింగ్ అలంకరణలు, భారీ ప్లాట్ పామ్ షాపుల తీర్ధం లో పాల్గోవడానికి విశేషంగా భక్తులు హాజరు అవుతున్నారు. నేటి ఆదివారం సాయంత్రం 5గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శన తో పాటు .. 7 గంటలకు హరికథ, 8 గంటలనుండి సత్య ఆర్కెస్ట్రా వారి సినీ మ్యూజికల్ నైట్ ప్రదర్శన ఉంది. ఉత్సవాల నేపథ్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ( నీరుల్లి కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో..)అధ్యక్షులు రామాయణం గోవిందరావు తో కలసి మిగతా సభ్యులు ఉత్సవ నిర్వహణ చేస్తున్నారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీ అమ్మవారి దర్శనం వేగంగా జరుగుతుందని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
