సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీసుకున్న చొరవతో త్వరలో పిఠాపురం నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు అందనున్నాయి. పాఠశాలల్లో విద్యాబోధనతోపాటు క్రీడలకు ఉన్న సౌకర్యాలపై ఇటీవల పవన్‌కల్యాణ్ ఆరా తీశారు. ఇందులో భాగం గా నియోజకవర్గంలోని 32 ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలుకు క్రీడాసామగ్రి కిట్లు సమకూర్చాలని నిర్ణ యించారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి పాఠశాలకు రెండు స్పోర్ట్స్ కిట్లు అందించనున్నారు. ఒక్కొక్క కిట్‌కు రూ.25వేలు వ్యయం అవుతుందని అంచనా. ఇందు నిమిత్తం రూ.16 లక్షలు అవసరమవుతాయని గుర్తించారు. ఈ నిధులను సీఎస్‌ఆర్ ఫండ్స్ నుంచి సమకూరుస్తామని జిల్లా కలెక్టరు షాన్‌మోహన్ డిప్యూటీ సీఎంకు తెలియజేశారు. పాఠశాలల కు అందించే కిట్లను మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలోపవన్‌కల్యాణ్ పరిశీలించారు.
