సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు, సోమవారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి అర్ధ మండల దీక్షా మాలధారణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నిజానికి 40 రోజుల మండల దీక్షలు ఈ నెల 7 న అశ్వయుజ పౌర్ణమి నాడు ప్రారంభం కాగా.. ఈరోజు అర్ధమండల దీక్ష కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ కలశస్థాపన పూజ జరిపి, ప్రారంబించారు 320 మంది భక్తులు దీక్షా మాలధారణ ధరించారని, అఖరుగా పాదమండల దీక్ష వచ్చే నెల 6 న ప్రారంభం కానుందని…శ్రీ అమ్మవారి భక్తులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. వీరందరి దీక్ష విరమణ మహాపూర్ణాహుతి వచ్చే నెల 16 ఆదివారం జరుపబడును అని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
