సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో బలివే మహా శివరాత్రి ఉత్సవాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమ్మిలేరులో మునిగి ఇద్దరు అన్నతమ్ములు మరణించడం విషాదం నింపింది. లింగపాలెం మండలం తిమ్మక్కపాలేనికి చెందిన పేరిచర్ల మారేష్, మంగమ్మ, వారి ఇద్దరు కుమారులు మునియ్య (20), మణి కుమార్(18), బంధువులతో కలిసి బుధవారం బలివే ఆలయం వద్ద తమ్మిలేరులో స్నానాలు చేసి దర్శనానికి బయలుదేరారు. మారేష్ కుమ రులిద్దరూ మరల కొద్దిసేపు స్నానంచేసి వస్తామన్నారు. దర్శనానికి వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు కుమారు లిద్దరూ రాకపోవడంతో వారిని వెతుకుంటూ తమ్మిలేరు దగ్గరకు చేరుకున్నారు. ఇంతలో తమ్మిలేరు స్నానఘట్టాలకు ఎగువన మునిపల్లె సమీపంలో తమ్మిలేరు నీటిమడుగులో వారి మృతదేహాలు కనిపించడంతో హతాశులయ్యారు. దీనితో తల్లి మంగమ్మ, తండ్రి మారేష్, రోదనలతో వారి బాధ అంతాఇంతా కాదు..
