సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సీనియర్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ కు హ్యాట్రిక్ బంపర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తాజా 4వ చిత్రం ‘అఖండ-2‘ (Akhanda-2) సెప్టెంబర్ 25న విడుదల కు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో కుంభమేళా నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్.. ఈ సినిమా ఎట్టి పరిస్థితులలో సెప్టెంబర్ లోనే రిలీజ్ చెయ్యాలని బాలయ్య ఆదేశించాడట.. దానికి కారణం.. బాలకృష్ణ కెరీర్ లో కీలక సమయాలలో ఘనవిజయాలు సాధించిన సినిమాలు సెప్టెంబర్ మాసం లోనే విడుదల అయ్యాయి. . బాలయ్య సోలో హీరోగా కెరీర్ ప్రారంభించిన మొదటి రోజులలో ‘మంగమ్మగారి మనవడు 1984 సెప్టెంబర్ 7న రిలీజయింది. ఆ సినిమా 560 రోజులు డైరెక్ట్ గ మూడు ఆటలతో ఆడేసింది. ఇప్పటికీ తెలంగాణలో అత్యధిక రోజులు ఆడిన తెలుగు సినిమాగా ‘మంగమ్మగారి మనవడు’ నిలచి ఉండడం విశేషం!. ఒక్క సినిమా మినహాయిస్తే బాలయ్య సెప్టెంబర్ రిలీజెస్ అన్నీ హిట్స్ సాధించాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *