సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రతి 4 ఏళ్లకు వచ్చే ప్రపంచ క్రీడా సంబరాలు కోసం సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. 33వ ఒలింపిక్ క్రీడలను చిరస్మరణీయం చేసేందుకు ఫ్రాన్స్ పూర్తి సిద్ధంగా ఉంది. 129 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో మొదటిసారిగా ప్రారంభ వేడుకలు స్టేడియం లోపల కాకుండా బయట నిర్వహించనున్నారు. నేడు, శుక్రవారం రాత్రి సెయిన్ నది నుంచి పారిస్ క్రీడల వేడుకలు ప్రారంభం కానున్నాయి. 94 బోట్లలో 10,500 మంది అథ్లెట్లు బోట్లపై 6 కిమీ మేర పరేడ్స్ చెయ్యనున్నారు. అథ్లెట్లందరూ సెయిన్ నదిలో పడవలపై నగరం గుండా ప్రయాణిం చి ట్రోకాడెరో గార్డెన్‌కు చేరుకుంటారు.. ఈ ప్రారం భోత్సవాన్ని చూసేం దుకు దాదాపు 3 లక్షల మం ది ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంది. ఆధునిక ఒలింపిక్స్ 1896లో గ్రీస్‌లో ప్రారంభమయ్యాయి.
