సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం కొణితవాడ గ్రామంలోని బుద్ధ రాయుడు చెరువు వద్ద సుమారు రూ 3 కోట్ల 48 లక్షలతో నిర్మించిన 33 కేవీ కొణితివాడ ఫీడర్ ను నేడు శనివారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ , టీడీపీ రాష్ట్ర కోశాధికారి,మెంటే పార్ధ సారధి ప్రారంభించారు. భీమవరం పట్టణ అభివృద్ధిలో దాతల సహకారం పాత్రల ఎంతో ఉందని, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం – తాడేరు రోడ్డులో భీమవరం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీసోమేశ్వర స్వామి ఆలయ ముఖ ద్వారా ఆర్చ్ ను శనివారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. భీమవరం పట్టణం ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, అభివృద్ది చెందుతున్న మన పట్టణానికి దాతలందిస్తున్న సహకారాలు అద్వితీయమని అన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డి రామకృష్ణంరాజు , ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మెన్ బంగార్రాజు కూటమి నాయకులుపాల్గొన్నారు.
