సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శుక్రవారం పూజ్యులు, చరిత్రలో సనాతన హిందూ ధర్మ పరిరక్షకులు జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య స్వామి వారి శంకర జయంతి సందర్భంగా భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో గురు పూజ కార్యక్రమం ను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలను ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు అందించామని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
