సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో భారీగా పెట్టుబడులు.. వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. సాగుతోంది.. ఈ క్రమంలో సచివాలయంలో అత్యంత కీలకమైన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్ జరిగింది. ఈ ఎస్ఐపిబి తొలి సమావేశంలో 33,966 ఉద్యోగాలు కల్పించే రూ.85వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 10 కంపెనీలకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా భారీ పరిశ్రమలకు భూముల కోసం ల్యాండ్ పూలింగ్ విధానం చేపట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమలకు భూములు ఇచ్చే వారికి స్కిల్ డెవల్మెంట్ ద్వారా అదే సంస్థలో ఉద్యోగ, ఉపాధి కల్పించేలా ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను సాకారం చేసేలా ఒప్పందాలను నిత్యం ట్రాక్ చేయాలని సిఎం సూచించారు. దేశంలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ ఉందని.. ఆ పోటీని తట్టుకుని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేలా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల 5 సంవత్సరాలు పెట్టుబడులు రాలేదని, ఒప్పందాలు చేసుకున్న వాళ్లు కూడా గత ప్రభుత్వ తీరుతో వెనక్కి వెళ్లిపోయారని ఆరోపించారు.
