సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర పంచారామక్షేత్రంలలో ఒకటైన భీమవరం గునుపూడిలోని శ్రీసోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానం గాలి గోపురానికి రంగులు వేసే నిమిత్తం పూజ కార్యక్రమాలను నేడు, శనివారం ఎమ్మెల్యే అంజిబాబు నిర్వహించారు. ఆలయ అర్చకులు కందుకూరి సోంబాబు, చేరుకూరి రామకృష్ణ లు పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఎమ్మెల్యే అంజిబాబు పూజ రాటా వేసి పనులను ప్రారంభించి మాట్లాడారు. సుమారు రూ 8 లక్షలతో ఒక భక్తుని సహకారంతో గాలి గోపురానికి రంగులు వేయడం జరుగుతుందన్నారు.పుణ్యక్షేత్రాలలో మరింత మౌలిక సదుపాయాలను కల్పిస్తామని భీమవరంలోని పుణ్యక్షేత్రాల దర్శనాలకు వచ్చే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా మరింత మౌలిక సదుపాయాలను కల్పిస్తామని అన్నారు. ఆలయ ఈవో రామకృష్ణంరాజు, నల్లం చిట్టిబాబు, కొప్పినిడి శ్రీనివాస్, బ్యాంక్ బాబీ, రెడ్డి సత్తిబాబు, వేలూరి సుబ్రహ్మణ్యం ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
