సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ కృష్ణ మన మధ్య లేకపోయిన ప్రపంచ వ్యాప్తంగా ఆయన లక్షలాది అభిమానులు కూడాఏ పార్టీలో కొనసాగుతున్న, ఏ రంగంలో కొనసాగుతున్నా అయన స్ఫూర్తితో పట్టుదలకు వస్తే ‘కొండ ను సైతం ఢీ కొనే’ అదే సాహస తత్వం లోనే ఉంటారు. కృష్ణ వీరాభిమానులు గా ప్రసిద్ధి పొందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు ప్రస్తుత ఎమ్మెల్సీ నాగబాబు, భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జనసేన నేత రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మెన్ కనకరాజు సూరి , వైసీపీ నేత, ప్రముఖ లాయర్ రాయప్రోలు శ్రీనివాస మూర్తి, ఇంకా ఎందరో ప్రముఖులు ఇదే కోవకు చెందుతారు. మరి డేరింగ్ హీరో కృష్ణ కున్నమరో అభిమాని మాజీ నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే, రాష్ట్ర, డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు సూపర్ స్టార్ కృష్ణ తో తన అనుబంధానికి గుర్తుగా ఆయనతో దిగిన ఫోటో జత చేస్తూ తాజగా పోస్టు లో .. సాహసానికి మరో పేరు, గొప్ప స్నేహశీలి, మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రముఖ సినీ నటులు, అభినవ అల్లూరి సీతారామరాజు, పద్మభూషణ్ శ్రీ ఘట్టమనేని కృష్ణ గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు.మీ ..రఘురామా కృష్ణంరాజు
