సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ఇంటికి వెళ్లి రేషన్ ఇచ్చే రేషన్ వాహనాలను తొలగించి కూటమి ప్రభుత్వం, నేడు ఆదివారం కూటమి ప్రజా ప్రతినిధులు ప్రజలకు రేషన్ రైస్ రేషన్ దుకాణాల వద్ధ పంపిణీ ప్రారంభించారు.. అయితే ఈ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా డోర్ డెలివరీ విధానాన్ని తొలగించడం పై మండిపడ్డారు. జగన్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు మీకు ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష?.. మళ్లీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు?’.. పారదర్శకంగా ఇంటివద్దకే వచ్చి సేవలు అందిస్తూ, ప్రజలు తినగలిగే మధ్యస్థ సన్న బియ్యం క్వాలిటీతో అందిస్తూ, వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాలను తొలగించడం సరైనదేనా? రేషన్ షాపుల ద్వారా మరలా పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా? మా వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలు లో ఏర్పాటు చేసిన వాలంటీర్లను 10 వేలకు జీతాలు పెంచుతామని మీ వైపు తిప్పు కుని ఎన్నికల్లో వాడుకుని, తీరా అధికారంలోకి వచ్చాక పచ్చి అబద్ధాలు ఆడుతూ 2 లక్షల 60వేల మంది వాలంటీర్లను ఉద్యోగాలు పీకేసి రోడ్డుమీద నిలబెట్టారు. ఏపీ ఫైబర్ నెట్‌ల్లో వేలాది ఉద్యోగులను తొలగించారు. గ్రామవార్డు సచివాలయాలపై కక్ష కట్టి అందులో ఉన్న 33వేల శాశ్వత ఉద్యోగాలకు శాశ్వ తంగా సమాధికట్టారు.ఇప్పుడు రేషన్ డోర్‌డెలివరీని రద్దు చేయడంతో 9వేల రేషన్ వాహనాలపై ఆధారపడ్డ 20వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.. ,మొత్తంగా 3 లక్షల ఉద్యోగులు ఒక్క ఏడాదిలో పీకేశారు. ఇన్ని లక్షల కుటుంబాల పొట్టకొట్టడం మీకు మాత్రమే సాధ్యం చం ద్రబాబు అంటూ జగన్ ఎద్దేవ చేశారు.
