సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మీదుగా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కృషితో 6 ఏళ్ల 4 నెలల తర్వాత చరిత్రలో ఎన్నడూలేనివిధంగా సుదీర్ష కాలానికి 1శాతం వడ్డీతోసహా నిధులు నేషనల్ హైవేకు భూములు ఇచ్చిన రైతులకు 24.89 కోట్ల నష్టపరిహారం మంజూరు అయ్యింది. నేడు, సోమవారం భీమవరంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ,జిల్లా కలెక్టర్ నాగరాణి, నేషనల్ హైవే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజీవ రాయుడు, ఆర్డిఓ కే. ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి, వర్మ మాట్లాడుతూ.. ఆకివీడు మండలంలోని ఆకివీడు, దుంపగడప, అజ్జమూరు గ్రామాలకు చెందిన రైతుల నుండి నేషనల్ హైవే కోసం 28.95 ఎకరాల భూమి సేకరించారని, భూమి కోల్పోయిన రైతులకు24.89 కోట్ల నష్టపరిహారం మంజూరు కాగా తొలివిడతగా 7.47 కోట్ల రూపాయలు నష్ట పరిహారం అందజేశామన్నారు. మిగిలిన నష్టపరిహారం త్వరలోనే అందజేస్తామన్నారు. నేషనల్ హైవే 165లో రెండో దశలో 2లైన్లుగా ఉన్న అజ్జమూరు-దిగమర్రు మధ్య భీమవరం బైపాస్ తో కలిపి రహదారిని 4లైన్లుగా మార్చినట్లు, త్వరలోనే 2వేల 500కోట్లతో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. నరసాపురం వాసుల ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు బైపాస్ రోడ్డు కోసం మొగల్తూరు, సీతారామపురం, లక్ష్మణేశ్వరం గ్రామాల్లో భూములిచ్చిన 87మందికి 6కోట్ల 2లక్షల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. త్వరలోనే నర్సాపురం నుండి చెన్నైకు వందే భారత్ రైలు ప్రారంభమవుతుందని, అలాగే అత్తిలి, వీరవాసరం లాంటి రైల్వే స్టేషన్ లో విశాఖ, నాగర్ సోల్, సర్కార్ ఎక్స్ ప్రెస్ లకు హాల్ట్ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆకివీడు కి చెందిన నేషనల్ హైవే కి భూములు ఇచ్చిన రైతులు మంత్రి శ్రీనివాస వర్మను ఘనంగా సత్కరించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
