సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వం లో అన్ని గ్రామాలను మోడరన్ గ్రామాలుగా అభివృద్ది చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో నేడు, మంగళవారం పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి సంయుక్తంగా ప్రారంభించారు. ప్రజలనుద్దేశించి వారు మాట్లాడుతూ.. రూ 19 లక్షలతో రాయలం పంచాయతీ కార్యాలయం, రూ 34 లక్షలతో సీసీ డ్రెయిన్ లను ప్రారంభించామని అన్నారు. గత ఐదేళ్లలో అభివృద్ధి అంటేనే కనిపించలేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని వారు అన్నారు. భీమవరం నియోజక వర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు అభివృద్ది చేస్తున్నామని, రానున్న రోజుల్లో భీమవరం నియోజకవర్గం ఆదర్శ నియోజక వర్గంగా చేసుకుందామని అన్నారు. తదుపరి వైసీపీ అనుకూల సాక్షి చేనెల్ లో అమరావతి మహిళలను వేశ్యలు అంటూ కించపరిచారని సాక్షి దినపత్రికలను రోడ్లపై వేసి దహనం చేసి తమ నిరసన ప్రదర్శించడం జరిగింది. కార్యక్రమంలో రాయలం గ్రామస్తులు, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు పాల్గొన్నారు.
