సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌లోని ఓ రైలులోని వికలాంగుల పెట్టెలో మహిళ మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ మహిళను హత్య చేసిన సైకోను గుజరాత్‌లోని వల్సాద్ పోలీసులు చాకచక్యంగా గత సోమవారం (నవంబర్ 26) ఎట్టకేలకు పట్టుకున్నారు ఇతనిని హైదరాబాద్ కు తీసుకోని వచ్చి విచారణ చేపట్టే క్రమంలో పోలీస్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాలలో 5 హత్యలు చేసాడు. అని తెలుసుకొన్నారు. ఈ సైకో తెలివిగా రైళ్లలోని చివరిభోగీలో ఉండే వికలాంగ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కి ప్రయాణికులపై అత్యాచారం, హత్యలు చేయడానికి అలవాటు పడ్డాడు. ఇలా ఏడాది గత అక్టోబర్ 17 నుంచి నవంబర్ 24 మధ్య కేవలం 35 రోజుల్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో సంచరిస్తూ ఐదు మర్డర్లు చేశాడు.గుజరాత్ పోలీస్ అధికారులు సేకరించిన వివరాలు ప్రకారం.. అతడి పేరు భోలో కరమ్‌వీర్ జాట్ అలియాస్ రాహుల్. హర్యానాలోని రోహ్తక్‌లో ఉన్న మోక్రా ఖాస్ స్వస్థలం. గతంలో రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల్లో నేరాలు చేశాడు. ఇటీవల రైల్వేలో సీరియల్ కిల్లర్‌గా మారాడు.కరమ్‌వీర్‌కు చిన్నతనంలోనే ఎడమ కాలికి పోలియో సోకింది. ఫలితంగా చిన్నతనం నుంచే ఒంటరిగా ఉంటూ, విచిత్రంగా ప్రవర్తించేవాడు. దీంతో అతడి కుటుంబం కూడా దూరంగా పెట్టింది. తరువాత లారీ క్లినర్ గా పనిచేసాడు. ఇప్పుడు సైకో కిల్లర్ గా మారాడు
